Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

Author
Posted By Praja Nestham Jwala News
| 19 Oct 2026, 08:06 PM |
మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

భీమదేవరపల్లి, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం మహార్నవమిని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, శైవశుద్ధి, పుణ్యాహవాచనం, సర్వతోభద్ర మండల ఆవాహన తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చతుఃషష్టి ఉపచార పూజలతో పాటు అమ్మవారికి దుర్గార్చన చేపట్టారు. అమ్మవారి దివ్య అలంకారాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి. కిషన్‌రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి