Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మామునూరు ఓపెన్ ఎయిర్ జైలును తనిఖీ చేసిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Oct 2026, 05:12 PM |
మామునూరు ఓపెన్ ఎయిర్ జైలును తనిఖీ చేసిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

హనుమకొండ, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ శనివారం మామునూరు ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైలులోని లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఖైదీలకు అర్హత మేరకు ఉచిత న్యాయ సహాయం సకాలంలో అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం బ్యారక్‌లలోని ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలు, న్యాయపరమైన సమస్యలు, కేసుల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జైలర్ జలేందర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. శ్రీనివాసరావు, జైలు సిబ్బంది పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి