Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండలో వీధికుక్కల దాడి.. ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Oct 2026, 05:10 PM |
హనుమకొండలో వీధికుక్కల దాడి.. ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

హనుమకొండ, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): హనుమకొండలో వీధికుక్కల దాడి కలకలం రేపింది. ఎక్సైజ్ కాలనీ రోడ్డు నంబర్‌ 5లో ఏడేళ్ల అరవింద్‌పై సుమారు ఐదు వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కుక్కలను తరిమివేసి, బాలుడిని చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు తక్షణమే స్పందించి వీధికుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.