Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎస్సీ, ఎస్టీ కేసు దర్యాప్తుపై సీపీకి జర్నలిస్టుల ఫిర్యాదు

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 07:57 PM |
ఎస్సీ, ఎస్టీ కేసు దర్యాప్తుపై సీపీకి జర్నలిస్టుల ఫిర్యాదు

హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): ఎస్సీ, ఎస్టీ కేసు (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 471/2025) దర్యాప్తు ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్థానిక జర్నలిస్టులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతకు శనివారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ వాంగ్మూలాలు నమోదు చేయకుండానే చేసినట్లు పోలీసు రికార్డుల్లో పేర్కొన్నారని, దర్యాప్తు పూర్తిచేసి కేసును మూసివేశారని జర్నలిస్టులు ఫిర్యాదులో ఆరోపించారు. సంబంధిత రికార్డులను పరిశీలించి, దర్యాప్తు ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత విచారణ జరిపించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణలపై విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడికానున్నాయి.