Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గ్యాస్‌ వినియోగదారులకు కొత్త సౌకర్యం.. ‘జిప్‌ లైట్‌’ కనెక్షన్‌ ప్రారంభం

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 07:17 PM |
గ్యాస్‌ వినియోగదారులకు కొత్త సౌకర్యం.. ‘జిప్‌ లైట్‌’ కనెక్షన్‌ ప్రారంభం

భీమదేవరపల్లి, అక్టోబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) భారత్‌ గ్యాస్‌ బ్రాండ్‌పై ‘జిప్‌ లైట్‌’ పేరుతో తేలికపాటి వంటగ్యాస్‌ సిలిండర్‌ కొత్త కనెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సులభంగా తరలించేందుకు వీలుగా, సిలిండర్‌లో మిగిలిన గ్యాస్‌ స్థాయిని బయట నుంచే గుర్తించేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రకటించిన ధరల ప్రకారం సిలిండర్‌ ధర రూ.3,186, పత్రాల పరిశీలన రుసుము రూ.295, భద్రతా రుసుము రూ.190 కలిపి కొత్త కనెక్షన్‌కు రూ.3,671 చెల్లించాలి. గ్యాస్‌ నింపే ఖర్చు అదనంగా ఉంటుంది.

సిలిండర్‌లో గ్యాస్‌ నిల్వను సులభంగా గుర్తించడంతోపాటు, తుప్పు నిరోధకత, భద్రతకు ప్రాధాన్యమిచ్చే సాంకేతికతను వినియోగించినట్లు సంస్థ తెలిపింది. ఆధార్‌ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు చిరునామా వివరాలు సమర్పించి కనెక్షన్‌ పొందవచ్చని పేర్కొంది. హలో బీపీసీఎల్‌ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించినట్లు, నాలుగు గంటల్లో ఇంటి వద్దకే సిలిండర్‌ సరఫరా చేసే సేవను అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

గ్యాస్‌ వినియోగదారులకు కొత్త సౌకర్యం.. ‘జిప్‌ లైట్‌’ కనెక్షన్‌ ప్రారంభం - Additional Image