Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తక్షణ రుణాల ఆశతో మోసపోవద్దు.. నకిలీ లోన్ యాప్‌లపై ఎస్పీ హెచ్చరిక!

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 04:06 PM |
తక్షణ రుణాల ఆశతో మోసపోవద్దు.. నకిలీ లోన్ యాప్‌లపై ఎస్పీ హెచ్చరిక!

ఆసిఫాబాద్, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): తక్షణ రుణాల పేరుతో మోసపూరిత లోన్ యాప్‌లను నమ్మి సైబర్ మోసాలకు గురికావద్దని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ మోసాల నివారణ అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. రుణం కోసం ముందస్తు చెల్లింపులు చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలను ఇతరులకు వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్, ఐపీఎస్, ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, డి.ఫోర్.సి ఆర్‌ఎస్‌ఐ కిరణ్, ఎస్‌ఐ దివ్యతో పాటు డి.ఫోర్.సి బృందం సిబ్బంది పాల్గొన్నారు.