Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 03:54 PM |
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

వేలేరు మండల సమన్వయకర్తగా బిల్లా యాదగిరి నియామకం

వేలేరు, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీకి ఎన్నికల సమన్వయకర్తలను ప్రకటించారు. ఇందులో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్‌గా వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా బిల్లా యాదగిరి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతానని తెలిపారు. అందరి సహకారంతో పట్టభద్రుల ఓటర్లను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించేందుకు కృషి చేస్తానని బిల్లా యాదగిరి వెల్లడించారు.