Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యుత్ సరఫరాపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరా!

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:16 PM |
విద్యుత్ సరఫరాపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరా!

పరకాల, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): పరకాల పట్టణంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరా తీశారు. పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన విద్యుత్ సరఫరా, నిర్వహణ తీరును పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌ను తనిఖీ చేసి, విద్యుత్ సరఫరాకు సంబంధించిన వివరాలను అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా పరిస్థితులు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై సిబ్బందితో చర్చించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ ప్రస్తుత పరిస్థితులపై వివరాలు సేకరించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట మాజీ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.