Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

525 సర్వే నంబర్‌లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం!

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Oct 2026, 08:28 AM | Array
525 సర్వే నంబర్‌లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం!

📌 ప్రజానేస్తం జ్వాల కథనానికి స్పందన.. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు తొలగింపు


ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారుల హెచ్చరిక.. ఇకపై అక్రమ నిర్మాణాలు చేస్తే కేసులే!

నడికూడ, అక్టోబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):నడికూడ మండలంలోని సర్వే నంబర్‌ 525 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ప్రజానేస్తం జ్వాల వెలుగులోకి తెచ్చిన కథనానికి స్పందన లభించింది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు.ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వెలువడిన కథనం అధికార యంత్రాంగంలో కదలిక తీసుకొచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు.

కథనంతో కదిలిన అధికార యంత్రాంగం

ఇవి కూడా చదవండి

సర్వే నంబర్‌ 525లో ప్రభుత్వ భూమిని పరిరక్షించడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. అధికారులను కదిలిస్తున్న ప్రజానేస్తం జ్వాల.