Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోలీసు ఉద్యోగార్థులకు స్క్రీనింగ్ టెస్ట్

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Oct 2026, 10:54 AM |

పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో ప్రత్యేక స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు హుజూర్‌నగర్‌ ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు హుజూర్‌నగర్‌లోని సాయిబాబా థియేటర్‌ రోడ్డులో ఉన్న గ్రీన్‌వుడ్‌ పాఠశాలలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్ష రోజున ఉదయం 9 గంటలలోపు పాఠశాల వద్దకు చేరుకోవాలని సూచించారు.ఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌కు సుమారు 400 మంది అభ్యర్థులను ఎంపిక చేసి పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఐ చరమందరాజు, ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగ సాధన దిశగా ముందుకు సాగాలని వారు కోరారు.