బియ్యం అక్రమ నిల్వదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

* రైస్ మిల్లులు, గోదాములపై తక్షణ తనిఖీలు చేపట్టాలి * సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఆదరి శ్రీనివాస్ డిమాండ్ భీమదేవరపల్లి, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండలంలోని రైస్ మిల్లులు, బియ్యం గోదాముల్లో అక్రమంగా బియ్యం నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కామ్రేడ్ ఆదరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అక్రమ నిల్వల ద్వారా బియ్యం ధరలను కృత్రిమంగా పెంచుతూ పేద ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం భీమదేవరపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం...