ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి
కోదాడ, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ఉద్యమకారులంతా ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవుల రామారావు నివాసంలో సూర్యాపేట జిల్లా ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి డాక్టర్ చీమ శ్రీనివాస్, ఆవుల రామారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం...