ఫ్యాన్సీ నంబర్ల దరఖాస్తు గడువు 60 నుంచి 30 రోజులకు కుదింపు

హనుమకొండ, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): కొత్త వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లు పొందాలనుకునే వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ కీలక మార్పు చేసింది. ఫ్యాన్సీ నంబర్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన నిబంధనలు నవంబర్‌ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. రవాణా శాఖ నవంబర్‌ 18న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్‌) చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు వాహన యజమానులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసుకుని కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి...