హెచ్ఐవీ నియంత్రణలో హనుమకొండకు ‘సురక్షిత్ జిల్లా’ గుర్తింపు
హనుమకొండ, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాల అమలులో జాతీయ లక్ష్యాలను సమర్థవంతంగా సాధించిన హనుమకొండ జిల్లాకు ప్రతిష్టాత్మక ‘సురక్షిత్ జిల్లా’ గుర్తింపు లభించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో జిల్లా కనబరిచిన ప్రగతికి ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీఎస్ఏసీఎస్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఇందిర శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ గుర్తింపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమష్టి కృషికి దక్కిన ఫలితమని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. హెచ్ఐవీ పరీక్షలు,...