పోచంపల్లి ఫౌండేషన్‌తో పరకాల వైకుంఠధామం ఆధునీకరణ

పరకాల, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): పరకాల పట్టణంలోని వైకుంఠధామాన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేసేందుకు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముందుకొచ్చారు. తన ఆధ్వర్యంలోని పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పనులకు సంబంధించిన సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని కోరుతూ పరకాల మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. 2026 సెప్టెంబర్‌ 5న జరిగిన పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. తమ...