పార్టీ మారే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం: మాజీ కార్పొరేటర్ల స్పష్టీకరణ
హనుమకొండ, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ నగరానికి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వారు ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలోనే ఐక్యంగా కొనసాగుతామని స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు భైరబోయిన దామోదర్ యాదవ్, ఉమా, ఎలగం సత్యనారాయణ, ప్రవీణ్, బసవరాజ్ కుమార్, ఫుర్ఖన్, పల్లం పద్మ రవి మాట్లాడారు. తమపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న...