రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల జీవిత బీమా.. నవంబర్ 19 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం
హనుమకొండ, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నమోదు ప్రక్రియ నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. రేషన్ కార్డు లేదా ఎఫ్‌ఎస్‌సీ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుండగా, లబ్ధిదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. అర్హతలు, నిబంధనలు కుటుంబంలో బీమా చేయించుకునే సంపాదించే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. కుటుంబంలో...