నిధులు ఇవ్వకుంటే మునుగోడులో కురుక్షేత్రమే.. సీఎం రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలనతో ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కాలం కలిసి వచ్చిందని, మిగిలిన రెండేళ్ల పాలనలో అందరినీ సమానంగా చూస్తూ రాష్ట్ర ప్రజలకు తండ్రి పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడంతో పాటు, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను వెంటనే రూ.5 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను...