విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలి

సాయి గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం సూర్యాపేట, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. విద్యార్థి దశ జీవితానికి పునాది వంటిదని, ఈ దశలోనే మంచి అలవాట్లను అలవర్చుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని సాయి గౌతమి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ ప్రసన్న కుమార్...