విద్యార్థుల్లో ఎన్నికల అక్షరాస్యత పెంపొందించాలి
సూర్యాపేట, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో సూర్యాపేట జిల్లాలో జిల్లా స్థాయి ఎన్నికల అక్షరాస్యత పోటీలను బుధవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మార్గదర్శకత్వంలో, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా నోడల్ అధికారి, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. స్వచ్ఛమైన, తప్పులులేని ఓటర్ల జాబితా ప్రాముఖ్యత, ఓటరు నమోదు విధానం, ఎన్నికల నిర్వహణలో ఎన్నికల...