డంపింగ్ యార్డు భూతానికి మరో పసి బాలిక బలి!

జవహర్‌నగర్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగానే 14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మృతి చెందిందని డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆరోపించింది. బాలిక మృతికి డంపింగ్ యార్డు కాలుష్యమే కారణమని కమిటీ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన రాంకీ చెత్త డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని కోరారు. కీసర సర్కిల్ పరిధిలోని జవహర్‌నగర్ జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో రాంకీ గేట్ సమీపంలోని శాంతినగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్లు కమిటీ...