రైస్ మిల్లుల ధూళి కాలుష్యంతో 19వ వార్డు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం.. కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలి హుజూర్‌నగర్, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు లింగగిరి రోడ్డులో ఉన్న రెండు రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డు కౌన్సిలర్ వల్లపుదాస్ కృష్ణ గౌడ్ తెలిపారు. రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న ధూళి ఇళ్లలోకి చేరడంతో చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, దగ్గు తదితర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఇళ్ల పరిసరాలు, వీధులు ధూళితో నిండిపోతున్నాయని, ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ సమస్యకు...