రైస్ మిల్లు దుమ్ము, ధూళితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్ల వినతి హుజూర్‌నగర్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14, 15, 16 వార్డుల ప్రజలు లింగగిరి రోడ్డులో ఉన్న రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న పొట్టు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా వార్డుల కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు బుధవారం మున్సిపాలిటీ మేనేజర్ అశోక్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న నల్లని పొట్టు దుమ్ము ఇళ్లపై, బయట ఆరేసిన దుస్తులపై, ఇతర వస్తువులపై పేరుకుపోతోందని తెలిపారు. దుమ్ము కళ్లలో పడటంతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు, అలర్జీ సమస్యలు ఉన్నవారు తీవ్ర...