పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కడియం శ్రీహరి

ధర్మసాగర్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల్లో తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి ఆశీర్వదించారు. అనంతరం గ్రామస్తులు, నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాటికాయల మాజీ సర్పంచ్ పెసరు రమేష్, నారాయణగిరి సర్పంచ్ రేణుక, రామిరెడ్డి, రాపాకపల్లి సర్పంచ్ జయందర్, ధర్మసాగర్ సర్పంచ్ మాచర్ల జ్యోతి, ఏలీయా, ముప్పారం సర్పంచ్ రేణుకతో పాటు పరిసర గ్రామాల సర్పంచులు,...