ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నాగర్‌కర్నూల్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. కుటుంబంలో జీవనోపాధికి ప్రధాన ఆధారంగా ఉన్న వ్యక్తిని జీవిత బీమా కోసం ఎంపిక చేసుకోవచ్చని వెల్లడించారు. అర్హులైన...