ఉపాధి హామీ పనులతో గ్రామీణాభివృద్ధికి బాటలు వేయాలి

కూలీలకు నిరంతర ఉపాధి.. శాశ్వత ఆస్తుల నిర్మాణమే లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పంజాగుల, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, గ్రామాల్లో శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. కల్వకుర్తి మండలం పంజాగుల గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పొలం చెరువు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. పొలం చెరువులు, నీటి సంరక్షణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ఉపాధి హామీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం పంజాగుల గ్రామంలో మహిళా...