అంటుకట్టడం, తేనెటీగల పెంపకంపై కీతవారిగూడెం రైతులకు అవగాహన
కీతవారిగూడెం, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అధిక దిగుబడులు, అదనపు ఆదాయం సాధించాలని వ్యవసాయ విద్యార్థినులు సూచించారు. ఏలూరులోని సీహెచ్ఎస్డీ మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం విద్యార్థినులు గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) మార్గదర్శకత్వంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా కీతవారిగూడెం గ్రామ రైతులకు అంటుకట్టడం, తేనెటీగల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంటుకట్టడం (గ్రాఫ్టింగ్) ప్రాముఖ్యత, వివిధ రకాలు, అనుసరించాల్సిన పద్ధతులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థినులు రైతులకు వివరించారు. అంటుకట్టడం ద్వారా నాణ్యమైన మొక్కలను అభివృద్ధి చేయడంతో పాటు,...