మామునూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ సీపీ ఎన్. శ్వేత
వరంగల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మంగళవారం మామునూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీపీ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు...