అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
కీసర సర్కిల్ పరిధిలో 2,500 మందికి నూతనంగా చేయూత పెన్షన్లు మంజూరు జవహర్నగర్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల):అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందించడమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం దమ్మాయిగూడలోని సాయి భవాని ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు...