ఖమ్మం క్రాస్ రోడ్లో ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించిన జిల్లా ఎస్పీ
సూర్యాపేట, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రశాంత్ కుమార్, సీఐ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డితో కలిసి రహదారిపై ట్రాఫిక్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సేఫ్టీ కోన్స్‌ను పరిశీలించి, అవి సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజలు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రహదారులపై ఇష్టానుసారంగా,...