ఆసిఫాబాద్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ

ఆసిఫాబాద్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కార్తీక్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెన్షన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు నిఖిల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామయ్య, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.