'అక్వాన్' తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు!
హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' (Akvan) తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 20, 21 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం నవంబర్ 20న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే నవంబర్...