ఈనెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

* అర్హులైన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి.. డిసెంబర్ 20 వరకు గడువు * కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం సూర్యాపేట, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుందని, జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో...