మున్సిపల్ పన్నుల పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన దీక్షకు మద్దతు

ములుగు, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): ములుగు మున్సిపాలిటీలో పన్నులను అడ్డగోలుగా పెంచారంటూ బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి పలువురు నాయకులు మద్దతు తెలిపారు. పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 48 గంటల నిరాహార దీక్షకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో పాటు బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పెంచిన పన్నుల వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక...