2,418 మందికి చేయూత పింఛన్ల మంజూరి పత్రాల పంపిణీ

వృద్ధాప్య పింఛన్లను కూడా త్వరలో మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' ఆలపించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో కొత్తగా చేయూత పింఛన్లకు ఎంపికైన 2,418 మంది లబ్ధిదారులకు మంజూరి పత్రాలను...