పాదయాత్ర బృందానికి వంటేరు ప్రతాపరెడ్డి స్వాగతం.. మద్దతు
గజ్వేల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): పాదయాత్ర చేపడుతున్న బృందానికి గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి స్వాగతం పలికి తన సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా ఆయనను కలిసిన బృంద సభ్యులను ఆప్యాయంగా ఆహ్వానించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం చేపడుతున్న కార్యక్రమాల పట్ల తన మద్దతును తెలియజేస్తూ, వారి ప్రయత్నాలకు సంఘీభావం ప్రకటించారు. పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి సత్కరించడం పట్ల సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కూక్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కనకయ్య ముదిరాజ్తో పాటు స్థానిక సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొని పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు.