చండూరులో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
చండూరు, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): చండూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన సతీమణి లక్ష్మితో కలిసి హాజరయ్యారు. అయ్యప్ప దీక్షా వస్త్రధారణలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం ఎమ్మెల్యే...