సాయినగర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. పోచమ్మ ఆలయం ప్రారంభం, బొడ్రాయి ప్రతిష్ఠాపన

భీమదేవరపల్లి, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం సాయినగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ ప్రారంభోత్సవం, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ఆశీర్వచనాల మధ్య ఆలయ ప్రారంభోత్సవం, బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు...