దుడ్డెల కొమురయ్య, ఎల్లమ్మల జ్ఞాపకార్థం పుస్తె మట్టెల పంపిణీ

జవహర్‌నగర్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): దివంగత కామ్రేడ్ దుడ్డెల కొమురయ్య, ఎల్లమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు బిజిలి రవీందర్ పేదింటి ఆడపిల్ల వివాహానికి పుస్తె మట్టెలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే సదుద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో, న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ అధ్యక్షుడు వెలిగొండ వెంకటస్వామి చొరవతో ఈ కార్యక్రమం చేపట్టారు. బిజిలి టీవీకి చెందిన దుడ్డెల రవీందర్ తన తల్లిదండ్రులైన కీర్తిశేషులు కొమురయ్య, ఎల్లమ్మల జ్ఞాపకార్థం పేదింటి నవ వధువుకు పుస్తె మట్టెలు అందజేశారు. ఇదే...