డిసెంబర్ 9న చలో హైదరాబాద్.. ఆదివాసీ అస్తిత్వ సభను విజయవంతం చేయాలి

నార్నూర్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఆదివాసీ అస్తిత్వ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తుడుందెబ్బ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన కరపత్రాలను సోమవారం నార్నూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం విగ్రహం వద్ద తుడుందెబ్బ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభలో ఆదివాసీ ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రతి గ్రామంలోని ఆదివాసీ నాయకులు, పటేళ్లు, యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేసి సభను విజయవంతం...