ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేయాలి

సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను విజయవంతం చేయాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సందడి నెలకొనేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, యువజనాభివృద్ధి, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనిబాలా దేవి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖేలో...