25 గ్రామ పంచాయతీలున్నా.. పిల్లల ప్రజావాణికి స్పందన కరువు!

అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు పాఠశాలల్లో సమస్యలున్నా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని విద్యార్థులు భీమదేవరపల్లి, నవంబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ పిల్లల ప్రజావాణి కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతతో పాటు ఇతర సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు పిల్లల ప్రజావాణి కార్యక్రమం గురించి తగిన అవగాహన కల్పించకపోవడమే స్పందన తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ దాని ఉద్దేశం, ఫిర్యాదులు ఎలా చేయాలి, ఎక్కడ...