కెరమెరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్

ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలి.. విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకూడదు గుడుంబా, పేకాట, బెట్టింగ్, గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలి కుమురం భీమ్ ఆసిఫాబాద్, నవంబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ కెరమెరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. వారి సమస్యలను ఓపికగా విని, చట్ట పరిధిలో సత్వర పరిష్కారం లభించేలా...