బల్దియా ప్రజావాణికి 92 ఫిర్యాదులు

హనుమకొండ, నవంబర్ 16, 2026 (ప్రజానేస్తం జ్వాల): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నగర ప్రజల నుంచి మొత్తం 92 ఫిర్యాదులు అందినట్లు బల్దియా కమిషనర్ టి. వెంకన్న తెలిపారు. విభాగాల వారీగా పరిశీలిస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 44 ఫిర్యాదులు అందగా, ఇంజనీరింగ్ విభాగానికి 28, రెవెన్యూ విభాగానికి 8, శానిటేషన్ విభాగానికి 7, నీటి సరఫరా విభాగానికి 4, హార్టికల్చర్ విభాగానికి ఒక ఫిర్యాదు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో సమర్పించిన వినతులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును...