హనుమకొండ జిల్లాలో ఈ నెల 22న పల్స్ పోలియో.. 84,654 మంది చిన్నారులకు చుక్కలు

హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించేలా వైద్య, ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి చేపడుతున్న ఏర్పాట్లు, లక్ష్యాలు, కార్యాచరణపై సమీక్షించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 84,654 మంది...