పదో తరగతి విద్యార్థులకు ఊరట.. ఎస్ఎస్‌సీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్‌సీ (SSC), ఓఎస్ఎస్‌సీ (OSSC), ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజును పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్‌లైన్‌లో జమ చేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఇచ్చింది. గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆలస్య రుసుముతో మరికొంత సమయం...