పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ముహూర్తం ఖరారు

సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు శ్రీశ్రీ లింగమంతుల స్వామి జాతర నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. 2027 ఫిబ్రవరి 21 నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతర కార్యక్రమాల వివరాలను దేవస్థానం పూర్వ చైర్మన్ మద్ది శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జాతరలో భాగంగా ఫిబ్రవరి 21న కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను పెద్దగట్టుపైకి తీసుకురావడంతో పాటు గంపల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22న స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. ఫిబ్రవరి 23న చందపట్నం వేయడం, ఫిబ్రవరి 24న నెలవారం నిర్వహించి దేవరపెట్టెను తిరిగి కేసారం...