నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం
సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతోంది. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి చిరునామా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అర్హులైన లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తోంది. సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం జీవితకాల స్వప్నం. ఆ కలను నిజం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, సర్పంచ్ రామాంజిగౌడ్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం నాలుగు గోడల నిర్మాణం...