ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించి పరిష్కరించాలి: ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే (ప్రజావాణి) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులు అందించిన వినతులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని, సమస్యల తీవ్రతను బట్టి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు అవసరమైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు పోలీస్ శాఖ...