వరంగల్ ESI కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
వరంగల్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ ESI ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు రావాల్సిన ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ, నిత్యావసర ఖర్చుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలను ఆలస్యం చేయకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం...